Rohit Sharma : కోహ్లీని ఆ టైమ్‌లో ఎలా ఆడించాలో నాకు తెలుసు : కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma : గ్రౌండ్ లో దిగాడంటే.. ప్రేక్షకుల నుంచి కేకలే కేకలు. బ్యాటు పట్టాడంటే.. బాదుడే బాదుడు.

Update: 2021-11-16 15:30 GMT

Rohit Sharma (tv5news.in)

Rohit Sharma : గ్రౌండ్ లో దిగాడంటే.. ప్రేక్షకుల నుంచి కేకలే కేకలు. బ్యాటు పట్టాడంటే.. బాదుడే బాదుడు. కెప్టెన్సీని చూపించాడంటే.. విజయాలే విజయాలు. అందుకే రోహిత్ శర్మ అంటే క్రికెట్ లవర్స్ కి అంత ఇష్టం. మామూలుగానే బ్యాట్ తో ఆన్సరిచ్చే ఈ లవ్లీ ప్లేయర్.. కెప్టెన్ గా కూడా బాధ్యతలు తీసుకుంటే.. ఇక ప్రత్యర్థి జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తాడు. ఇప్పుడూ అదే చేయబోతున్నానని ముందే చెప్పేశాడు.

టీమిండియాలో కొన్ని లోపాలున్నాయని ఎలాంటి జంకూగొంకూ లేకుండా కుండబద్దలు కొట్టేశాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వాటిని క్లియర్ చేయడమే తన ముందున్న సవాల్ అని స్పష్టంగా, సూటిగా, సుత్తిలేకుండా చెప్పాడు. టీమిండియా అంటే ఆటగాళ్ల సమూహం. అందులో ఒకరిద్దరిపైనే టీమ్ ఆధారపడితే చిక్కులు తప్పవు. దానివల్ల విజయాలూ రావు. రోహిత్ చెప్పిందీ ఇదే. దానికోసం ఏం చేయాలనుకుంటున్నాడో కూడా రోహిత్ పక్కా ప్లాన్ తో ఉన్నాడు.

ఏ ఆటగాడైనా కెప్టెన్ ఉద్దేశాలకు అనుగుణంగా ఎంతో కొంత ఆడక తప్పదు. టీమ్ ప్లాన్ లో భాగంగా బ్యాటింగైనా, బౌలింగైనా ఉంటుంది. అందుకే ఆటగాళ్లను తమకు అనుకూలంగా మార్చుకుంటామంటున్నాడు రోహిత్ శర్మ. ప్లేయర్లు ఒక్కోసారి బాగా ఆడవచ్చు. మరోసారి బాగా ఆడలేకపోవచ్చు. అయినా సరే.. అండగా ఉంటామన్న భరోసా కల్పిస్తామన్నాడు.

కోహ్లీ చాలా మంచి ప్లేయర్ అని.. ఆయన సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తనకు తెలుసని క్లియర్ గా చెప్పేశాడు రోహిత్ శర్మ. సో.. కెప్టెన్ గా తాను ఏం చేయాలో.. ఏం చేయకూడదో రోహిత్ కు ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఆయన ఆటతోపాటు కెప్టెన్సీని కూడా అంతగా ఇష్టపడతారు. ఇక రాబోయే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను ఎలా నడిపిస్తాడో చూడాలి.

Tags:    

Similar News