Rohit Sharma: ఇటీవల వైట్ బాల్ కెప్టెన్‌గా.. ఇంతలోనే అండర్ 19 టీమ్‌కు టీచర్‌గా..
Rohit Sharma: సౌతాఫ్రికాలో త్వరలో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు చాలామంది సీనియర్ ప్లేయర్స్ మిస్ అవ్వనున్నారు.;
Rohit Sharma (tv5news.in)
Rohit Sharma: సౌతాఫ్రికాలో త్వరలో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు చాలామంది సీనియర్ ప్లేయర్స్ మిస్ అవ్వనున్నారు. అందులో ఒకరు రోహిత్ శర్మ. ఈమధ్యనే వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌కు హిట్ మ్యాన్‌కు దూరంగా ఉండడం తన ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేసింది. ఒక గాయం కారణంగా రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో రోహిత్ కోలుకుంటున్నాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీలో పెద్ద క్రికెటర్ అయిపోవాలన్న కలలతో వచ్చే యువ క్రికెట్ ఎంతోమంది ఉంటారు. అలాంటి వారితో రోహిత్ ఎక్కువ సమయం గడుపుతున్నట్టు సమాచారం. అండర్ 19 ప్లేయర్స్‌ను టోర్నీకి సిద్ధం చేసే పనిలో ఉన్నాడట రోహిత్. వారికి గైడెన్స్ ఇస్తూ.. వారిని మంచి ప్లేయర్స్‌ను చేసే ప్రయత్నంలో రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక సౌతాఫ్రికా టెస్ట్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అటు తన గాయాం వల్ల రెస్ట్ తీసుకుంటూనే.. ఇటు అండర్ 19 ప్లేయర్స్‌కు శిక్షణ ఇస్తున్న రోహిత్ శర్మ.. వన్డే సిరీస్ సవాల్‌ను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. వన్డే సిరీస్ ప్రారంభం అయ్యే సమయానికి తన గాయం కూడా పూర్తిగా తగ్గిపోవాలని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Priceless lessons 👍 👍
— BCCI (@BCCI) December 17, 2021
📸 📸 #TeamIndia white-ball captain @ImRo45 made most of his rehab time as he addressed India's U19 team during their preparatory camp at the NCA in Bengaluru. pic.twitter.com/TGfVVPeOli