Ravindra Jadeja: సీఎస్‌కేకు పూర్తిగా దూరమయిన జడేజా.. వచ్చే ఐపీఎల్ సీజన్స్‌లో కూడా..

Ravindra Jadeja: సీఎస్‌కేకి జడేజా కెప్టెన్‌గా ఉన్నంతకాలం ఆ టీమ్ ఐపీఎల్‌లో ఒక్క ఆట కూడా గెలవలేకపోయింది.

Update: 2022-05-12 10:05 GMT

Ravindra Jadeja: ఐపీఎల్ 2022 ఎన్నో ట్విస్టులతో ముందుకెళ్తోంది. ప్రతీసారికంటే ఈసారి టీమ్‌ల మధ్య వివాదాలు, కాంట్రవర్సీలు కాస్త ఎక్కువగానే జరుగుతన్నట్టుగా కనిపిస్తోంది. కచ్చితంగా గెలుస్తాయి అనుకున్న పెద్ద పెద్ద టీమ్‌లు తమ ఆటతో అభిమానులను మెప్పించలేకపోతున్నాయి. ఇక సీఎస్‌కే టీమ్‌లో అయితే ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఇప్పటివరకు వెన్నుముకగా నిలిచాడు ఎమ్ ఎస్ ధోనీ. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కూడా ధోనీ ఎప్పుడూ తన వందశాతం ప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నించేవాడు. అయితే ఐపీఎల్ 2022లో మాత్రం అనూహ్యంగా తన కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అందజేశాడు. ఇప్పటివరకు సీఎస్‌కేలో ఆటగాడిగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన జడేజా.. కెప్టెన్‌గా కూడా నిరూపించుకుంటాడు అనుకున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్. కానీ అలా జరగలేదు.

సీఎస్‌కేకి జడేజా కెప్టెన్‌గా ఉన్నంతకాలం ఆ టీమ్ ఐపీఎల్‌లో ఒక్క ఆట కూడా గెలవలేకపోయింది. దీంతో తనపై విమర్శలు ఎక్కువయ్యాయి. అందుకే జడేజా తిరిగి తన కెప్టెన్సీని ధోనీకి ఇచ్చేశాడు. అదే సమయంలో ఆర్‌సీబీతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు జడేజా గాయపడ్డాడు. దీంతో ఐపీఎల్ 2022లో ఇకపై జడేజా ఆటలేడు అని అర్థమయ్యింది. ఈ విషయం సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది కూడా.

కానీ జడేజా మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కే టీమ్‌ను అన్‌‌ఫాలో చేయడంతో నిజంగానే గాయం వల్ల జడేజా టీమ్‌కు దూరమయ్యాడా లేదా కావాలనే దూరంగా ఉంటున్నాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆడిన జడేజా.. ఇకపై ఆ టీమ్‌లో ఉండడేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా రవీంద్ర జడేజా వీటిపై స్పందించేవరకు ఓ క్లారిటీ రాదు.

Tags:    

Similar News