మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. !
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.;
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని... రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చిందని చెప్పారు. అయితే తన ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని... డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే క్వారంటైన్ ఉన్నానని సచిన్ ట్వీట్ చేశారు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి టెండూల్కర్ ధన్యవాదాలు చెప్పాడు. సచిన్ ఇటీవలే రోడ్ సేఫ్టీ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ టీమ్‌కు నాయకత్వం వహించి... జట్టును టోర్నీ విజేతగా నిలిపాడు. ఈ సిరీస్ ముగిసి వారం రోజులు గడవక ముందే మాస్టర్ కరోనా బారిన పడ్డారు.