Test Cricket : పెరగనున్న టెస్టు క్రికెటర్ల జీతాలు

Update: 2024-02-28 07:35 GMT

టెస్టు క్రికెటర్లకు జీతాలు పెంచాలని బీసీసీఐ డిసైడ్ అయిందని తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ రూ.6 లక్షల చొప్పున జీతాలు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని రూ. 15 లక్షలు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

"ఏ ఆటగాడైనా క్యాలెండర్‌ ఈయర్‌లో మొత్తం అన్ని సిరీస్‌లలోనూ భాగమమైతే.. అతడికి వార్షిక కాంట్రాక్ట్‌ రిటైన్‌తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌ ఫీజులు కూడే పెరిగే ఛాన్స్‌ ఉంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్‌ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

అయితే కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఐపీఎల్‌-2024 సీజన్‌ తర్వాత అమలులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఐపీఎల్ 2024 తరువాత జరిగే టెస్టు సిరీస్ ల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని సమాచారం. ప్రతి టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటే ఆటగాళ్లకు బోనస్ ఇవ్వాలని కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది.

Tags:    

Similar News