Sania Mirza : 'బావగారూ.. బావగారూ'.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సానియా..!
Sania Mirza : ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు జట్ల మధ్య పోరుతో పాటుగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్‌ల గురించి కూడా కాస్త చర్చించుకుంటారు.;
Sania Mirza : ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు జట్ల మధ్య పోరుతో పాటుగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్‌ల గురించి కూడా కాస్త చర్చించుకుంటారు. తాజాగా జరిగిన ఇండియా, పాక్ టీ 20 వరల్డ్‌కప్ మ్యాచ్‌కి ముందు తాను సోషల్ మీడియా నుంచి మాయమైపోతానంటూ సానియా మిర్జా ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సానియా.. ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొందరు అభిమానులు షోయబ్ మాలిక్‌ను ఉద్దేశించి బావగారు బావగారు అంటూ కేకలు వేశారు. ఈ వీడియోని సానియా మిర్జా షేర్ చేస్తూ.. స్మైలింగ్ ఎమోజీలతో పాటు రెండు హార్ట్ సింబల్స్ జతచేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. కాగా షోయబ్ మాలిక్ అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. సోహైబ్ మక్సూద్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్ జట్టులోకి వచ్చాడు.