IPL 2022 : అండర్‌-19 కుర్రాళ్ళకి బిగ్‌షాక్‌..?

IPL 2022 : ఇటీవల అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన టీంఇండియా కుర్రాళ్ళకి బిగ్ షాక్ తగిలింది.

Update: 2022-02-08 11:00 GMT

IPL 2022 : ఇటీవల అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన టీంఇండియా కుర్రాళ్ళకి బిగ్ షాక్ తగిలింది. టీంలోని 8 మంది ఆటగాళ్లు (కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, వికెట్ కీపర్ దినేష్ బానా, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్‌) లు ఐపీఎల్‌ 2022 మెగావేలానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే... ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఓ ఆటగాడు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయిన ఆడాలి. లేదంటే లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.. దీనికి తోడు ఆ ఆటగాడి వయస్సు కచ్చితంగా 19 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడున్న జట్టులో కెప్టన్‌ యశ్‌ ధుల్‌ మినహా ఏ ఒక్క ఆటగాడి వయసు కనీసం 19 సంవత్సరాలు నిండలేదు.

దీనికి తోడు వారు ఇప్పటివరకు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో యష్‌ ధుల్‌ ఒక్కడే వేలంలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ ఎనమిది మంది దేశవాలీ టోర్నీలు ఆడకపోవడానికి బీసీసీఐ ఓ రకంగా కారణమని చెప్పొచ్చు.. ఎందుకంటే కరోనా కారణంగా ఈ రెండేళ్లలో దేశవాలీలో మేజర్‌ టోర్నీలు ఎక్కువగా జరగలేదు.

రెండేళ్లపాటు నిర్వహించని రంజీ ట్రోఫీని కూడా ఈ ఏడాదే నిర్వహించనున్నారు. అయితే ఈ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఏమైనా నిబంధనలు సడలించి నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి. కాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 

Tags:    

Similar News