Shikhar Dhawan: ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ రికార్డ్.. ఆ ఇద్దరి తర్వాత ఇతడే..
Shikhar Dhawan: క్రికెట్ అంటే ఎవరి రికార్డ్ పర్మనెంట్ కాదు. ఒకరి రికార్డును ఒకరు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే.;
Shikhar Dhawan: ప్రస్తుతం క్రికెట్ లవర్స్‌లో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈసారి ఐపీఎల్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. స్టార్ జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబాయి ఇండియన్స్.. రెండూ ప్లే ఆఫ్స్‌కు ముందుగానే దూరమయ్యాయి. ఇదంతా ఒకవైపు కాగా మరోవైపు క్రికెటర్లు ఎప్పటిలాగానే ఒకరి రికార్డును ఒకరు బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
క్రికెట్ అంటే ఎవరి రికార్డ్ పర్మనెంట్ కాదు. ఒకరి రికార్డును ఒకరు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. ఒక్కొక్కసారి తమరి రికార్డునే తాము బ్రేక్ చేసుకుంటారు క్రికెటర్. ఇటీవల జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆటగాడు శిఖర్ ధావన్ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యంత పరుగులు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు శిఖర్ ధావన్.
పంజాబ్ కింగ్స్ టీమ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్స్‌లో శిఖర్ ధావన్ ఒకడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌తో శిఖర్ ధావన్ ఐపీఎల్‌లోనే 9000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత పరుగులు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇక మొదటి స్థానంలో 10392 పరుగులతో విరాట్ కోహ్లి, రెండో స్థానంలో 10048 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నారు.