Shikhar Dhawan : 'నువ్వు కోహినూర్ డైమండ్‌ను రిజెక్ట్ చేశావు'.. ధావన్ బ్రేకప్ లవ్ స్టోరీ..!
Shikhar Dhawan : టీంఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటాడు..;
Shikhar Dhawan : టీంఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటాడు.. డైలాగ్స్, డాన్స్ లతో తన అభిమానులను అలరిస్తూనే ఉంటాడు.. ప్రస్తుతం IPL 2022 లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్... తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
క్రికెట్‌లో అప్పుడే ఎదుగుతున్న టైమ్‌లో ఓ అమ్మాయి చూసిన ధావన్ ఆమెకి ప్రపోజ్ చేశాడట.. ఆ టైమ్‌లో ధావన్ కాస్త నల్లగా ఉండేవాడట.. అంతేకాకుండా ముఖంపై మచ్చలు ఉండేవట. దీనితో ఆ అమ్మాయి ధావన్ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేసిందట.. ఆ తర్వాత ఆమెకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడట ధావన్.
నువ్వు కోహినూర్ డైమండ్‌ను రిజెక్ట్ చేశావు.. మళ్ళీ దొరకకపోవచ్చు అని అన్నాడట ధావన్.. ఈ విషయాన్ని ధావన్ స్వయంగా వెల్లడించాడు. ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉన్న శిఖర్ ధావన్‌ను IPL మెగా వేలం 2022లో 8.25 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఇక ధావన్ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీకి గతేడాది విడాకులు ఇచ్చాడు ధావన్.. అయేషాకి అంతకుముందు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరికీ హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్ కావడం విశేషం.