Shreyas Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..!
Shreyas Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు.. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.;
hreyas Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు.. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్‌ను రూ.12.25 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా 2020లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయాస్ ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. కోల్‌కతా వంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు తాను చాలా గౌరవంగా భావిస్తున్నట్టుగా శ్రేయాస్ వెల్లడించాడు.
కాగా ఇప్పటివరకు కోల్‌కతా టీంకి మెక్ కల్లమ్, గంగూలీ, గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీగా వ్యవహరించారు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012 మరియు 2014లో కోల్‌కతా జట్టు రెండుసార్లు IPL కప్ గెలుచుకుంది.