ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం
తొలి వన్డేలో.. ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్‌కి గాయమైంది.;
భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యార్.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సీరిస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. పుణె వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన తొలి వన్డేలో.. ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్‌కి గాయమైంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో.. ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్ట్రో బంతిని కవర్స్ దిశగా హిట్ చేయగా.. దాన్ని నిలువరించేందుకు శ్రేయస్ అయ్యర్ డైవ్ చేశాడు. కానీ.. ఆ సమయంలో బరువు మొత్తం ఎడమచేతి భుజంపై పడిపోయింది. దాంతో.. అతని భుజానికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిని శ్రేయస్ అయ్యర్‌ను ఫిజియో మైదానం వెలుపలికి తీసుకెళ్లాడు.
అనంతరం శ్రేయస్‌కు స్కానింగ్ చేయగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గాయం తీవ్రత తగ్గి మళ్లీ అయ్యర్ మైదానంలో అడుగుపెట్టడానికి ఆరు వారాల వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ప్రారంభ మ్యాచులకు సైతం ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయస్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. మరో వైపు, ఇదే మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ ఈ నెల 26, 28 తేదీల్లో పుణెలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డేలకు ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం.