సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. జట్టుకు మరో ఆటగాడు దూరం..!
సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరం కానున్నాడు. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి(విండిస్) వెళ్లనున్నాడు.;
సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరం కానున్నాడు. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి(విండిస్) వెళ్లనున్నాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టుకు ఇది ఉహించని షాక్ అనే చెప్పాలి. కాగా రెండో దశ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌కు దూరమయ్యారు. కరోనా బారిన పడి బౌలర్ నటరాజన్ జట్టుకు దూరం కాగా అతనికి సన్నిహితంగా ఉండి విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. ఇప్పుడు రూథర్‌ఫర్డ్ కూడా జట్టుకి దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపైన ఆసక్తి నెలకొంది. అటు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనమిది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఆ జట్టుకి కీ ప్లేయర్స్ ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్ళు దూరం అవ్వడం పెద్ద షాక్ అని చెప్పాలి.