Suresh Raina : సురేష్ రైనాకు బిగ్ షాక్..!
Suresh Raina : ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకి బిగ్ షాక్ తగిలింది.;
Suresh Raina : ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకి బిగ్ షాక్ తగిలింది.. మొన్నటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన అతను ఈ సారి కనీస ధర రూ. 2 కోట్లతో మెగా వేలానికి వచ్చాడు.. కానీ రైనాని కొనుగోలు చేసేందుకు ఒక్క జట్టు కూడా ముందుకు రాలేదు.. దీంతో రైనా అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. రైనా లాగే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, సౌత్ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ని కూడా ఏ జట్టు కూడా కొనలేదు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడాడు సురేష్ రైనా. 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.