Suresh Raina: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట విషాదం..
Suresh Raina: తాజాగా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట విషాదం చోటుచేసుకుంది.;
Suresh Raina: కోవిడ్ ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చింది. సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడి మరణించక తప్పలేదు. కరోనా కారణంగానే కాకుండా మరికొన్ని ఇతర కారణాలతో కూడా సెలబ్రిటీలు తమరు ప్రేమించే వారిని కోల్పోయారు. తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా అదే బాధను ఎదుర్కున్నాడు.
ఒకప్పుడు తన ఆటతో క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో అలరించిన సురేశ్ రైనా.. కొన్నాళ్ల క్రితం క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. దాని తర్వాత పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ మాజీ క్రికెటర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సురేశ్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా నేడు కన్నుమూశారు.
ఘజియాబాద్‌లో నివసించే త్రిలోక్‌చంద్ రైనా గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈయన ఒకప్పుడు మిలిటరీలో సేవలు అందించేవారు. అక్కడ త్రిలోక్‌చంద్ బాంబులు తయారు చేసేవారు. ఒకప్పుడు వీరు జమ్మూ కశ్మీర్‌లో ఉండేవారు. కానీ సురేశ్ రైనా చిన్నతనంలో వీరి కుటుంబమంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌కు షిఫ్ట్ అయిపోయారు.