AUS VS NZ : టీ20 వరల్డ్ కప్ 2021 క్లైమాక్స్.. తొలిసారి ట్రోఫి కోసం ఆసీస్ vs కివీస్...!
AUS VS NZ : టీ20 వరల్డ్ కప్ 2021 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.;
AUS VS NZ : టీ20 వరల్డ్ కప్ 2021 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టైటిల్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సూపర్ స్టేజ్ దశలో సాదా సీదాగా ఆడిన ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లో మాత్రం ప్రతాపం చూపించాయి. గ్రూప్ దశలో న్యూజీలాండ్ పాకిస్తాన్ మీద.. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ మీద ఓడిపోయాయి. అయితే అనూహ్యంగా సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓకే రీతిలో ఓడించాయి. రెండు సెమీఫైనల్స్ ఛేజింగ్ 19 ఓవర్లలోనే ముగించాయి.
ఈఏడాది టోర్నిలో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ సెమీస్‌లో వెనుదిరిగాయి. ఇక టీమ్ ఇండియా పరిస్థితి మరి దారుణం. సూపర్ 12 స్టేజి కూడా దాటలేదు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దారుణంగా విఫలమయ్యింది. దీంతో ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ సాధించని కివీస్ - ఆసీస్ తమ తొలి టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి.
ఇరు జట్ల బలాబలాలు చూస్తే ఎవరిని గెలుపు వరిస్తుందో చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. న్యూజీలాండ్ జట్టును పరిశీలిస్తే ఆ జట్టు టాపార్డన్ చాలా బలంగా కనిపిస్తుంది. గప్తిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా.. ఈ టోర్నీలో అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక డారిల్ మిచెల్ సెమీఫైనల్ హీరోగా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో సమయోచితంగా ఆడే సామర్థ్యం ఉన్నది. కేన్ విలియమ్‌సన్ తనదైన రోజున చెలరేగిపోతాడు. అయితే గాయం కారణంగా డెవాన్ కాన్వే జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇక ఆసీస్ విషయానికొస్తే..బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ పరంగా ఆజట్టు బలంగా కనిపిస్తోంది. వార్నర్, మ్యాక్స్‌వేల్, స్టోయినిస్, స్టార్క్, హజిల్‌వుడ్, కీలకం కానున్నారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇప్పటివరకు చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడం ఆజట్టును కలవర పెడుతోంది. సెమిస్ హీరో మాధ్యువేడ్ మరోసారి చెలరేగితే.. తొలిసారి ట్రోఫిని అందుకోవాలని చూస్తున్న కివిస్‌కు అందని ద్రాక్షే అవుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం.