Sachin Tendulkar: సచిన్ రాసిన రికార్డుకు పదేళ్లు.. ఓడీఐలో..

Sachin Tendulkar: 2012 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌ జరిగింది.

Update: 2022-02-24 12:33 GMT

Sachin Tendulkar (tv5news.in)

Sachin Tendulkar: క్రికెట్ చరిత్రలో కొన్ని మర్చిపోలేని రోజులు ఉంటాయి. అవి గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా.. క్రికెట్ లవర్స్ మాత్రం ఇలాంటివి గుర్తుపెట్టుకునే ఉంటారు. అలాగే సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగిన ఓడీఐ మ్యాచ్‌లో ఓ చరిత్రను సృష్టించాడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండుల్కర్. సచిన్ టెండుల్కర్.. ఈ పేరుకు క్రికెట్ ప్రపంచంలోనే కాదు.. ఇంకెక్కడా కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన క్రికెట్ కెరీర్‌లో ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసే ఎన్నో రికార్డులు ఉన్నాయి. 2012 ఫిబ్రవరి 24న కూడా ఇలాంటి ఓ రికార్డ్ క్రియేట్ అయ్యింది.

2012 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌ జరిగింది. టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి భారత్.. 401 పరుగులు చేసింది. అయితే దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇది టీమిండియా మర్చిపోలేని విక్టరీల్లో ఒకటి.

ఇండియా టాస్ అయితే గెలిచింది కానీ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వీరేందర్‌ సెహ్వాగ్‌ నాలుగు ఓవర్లలోనే కేవలం 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత వచ్చిన దినేశ్‌ కార్తీక్‌, సచిన్‌తో కలిసి ఆటను ముందుకు తీసుకెళ్లాడు. సచిన్ మాత్రమే 200 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. అప్పటివరకు ఓడీఐల్లో డబుల్ సెంచరీ ఎవ్వరూ చేయలేదు. అందుకే ఇది కూడా సచిన్ క్రియేట్ చేసిన రికార్డ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. 

Tags:    

Similar News