Virat Kohli: కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గా కూడా విరాట్ గుడ్‌బై!
Virat Kohli: వన్డే క్రికెట్‌కు విరాట్‌ను కాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం ద్వారా బీసీసీఐ గేరు మార్చింది.;
Virat Kohli (tv5news.in)
Virat Kohli: వన్డే క్రికెట్‌కు విరాట్‌ను కాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం ద్వారా బీసీసీఐ గేరు మార్చింది. విరాట్ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుండి మాత్రమే తప్పుకోగా.. బీసీసీఐ తనను వన్డే క్రికెట్‌కు కూడా కెప్టెన్‌గా తొలగించడంపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కోహ్లీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
త్వరలో వన్డే, టి20లకు విరాట్ కోహ్లీ పూర్తిగా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2023 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని విరాట్ తన టీ20 కెప్టెన్సీని పక్కన పెట్టేశాడు. ఒకేసారి అన్ని క్రికెట్ ఫార్మేట్స్ కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. ఎక్కువ ఒత్తిడి పడుతుందని విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే బీసీసీఐ విరాట్ ఆలోచనను తప్పుగా అర్థం చేసుకుని తనను వన్డే క్రికెట్ కెప్టెన్‌గా తొలగించిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు రోహిత్, మరోవైపు విరాట్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడం విరాట్‌కు ఇష్టం లేదని అందుకే తాను ఇలా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. కానీ కారణం ఏదైనా విరాట్ మాత్రం టెస్ట్ క్రికెట్ నుండి కూడా తప్పుకునే అవకాశాలు చాలానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.