Rashmika Mandanna : RCB అంటే ఇష్టం.. కానీ నేను కోహ్లీ ఫ్యాన్ కాదు : రష్మిక
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా..;
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. ముఖ్యంగా తనకి ఐపీఎల్ అంటే పిచ్చని వెల్లడించింది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానలు ఇచ్చింది ఈ బ్యూటీ.
ఐపీఎల్‌లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని, ఆ జట్టు ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ గెలవాలని కోరుకున్నానని, కానీ అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం ఓ అభిమానిగా నిరాశకి గురిచేసిందని చెప్పుకొచ్చింది.
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఫేవరెట్ జట్టు అయినప్పటికీ తన ఫేవరేట్ క్రికెటర్ మాత్రం ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కాదని వెల్లడించి, అందరిని ఆశ్చర్యపరిచింది. తనకి చెన్నై జట్టు కెప్టెన్, మాజీ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ లో ధోని సూపర్ అని ఆకాశానికి ఎత్తేసింది. కాగా ప్రస్తుతం కోహ్లీ అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాని చేస్తోంది.