Rachin Ravindra : ఎవరీ రచిన్‌ రవీంద్ర.. సచిన్, ద్రావిడ్ లతో ఏంటి సంబంధం?

Rachin Ravindra : ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే..

Update: 2021-11-18 13:50 GMT

Rachin Ravindra : ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ సిరీస్‌‌లో న్యూజిలాండ్ జట్టు తరుపున ఆడుతున్న క్రికెటర్ రచన్ రవీంద్రది కాస్త ఇంట్రెస్టింగ్ స్టొరీ.. అతని పేరు చూస్తే మనకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా... అవును ... 1990ల కాలంలోనే రచిన్‌ రవీంద్ర కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. ఆయన తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా పనిచేసేవాడు. \

ఆ తర్వాత ఆయన తన కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడిపోయారు. అక్కడ రవికృష్ణమూర్తి హట్‌ హాక్స్‌ పేరుతో క్రికెట్‌ క్లబ్‌ను ఆరంభించాడు. మధ్యమధ్యలో ఆయన బెంగుళూరు వచ్చి క్రికెట్ ఆడడం చేసేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా క్రికెట్‌ లక్షణాలను పుచ్చుకున్న రచిన్‌ రవీంద్ర నవంబర్‌ 18, 1999న జన్మించాడు. తల్లి పేరు దీపా కృష్ణమూర్తి... అయితే రవికృష్ణమూర్తికి రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌ అంటే వవీపరితమైన ఇష్టం.

దీనితో వారిమీద అభిమానంతో వారిపేర్లు కలిసి వచ్చేలా రచిన్‌ రవీంద్ర అనే పేరు పెట్టాడు. రచిన్‌ రవీంద్ర న్యూజిలాండ్‌ తరపున 6 టి20 మ్యాచ్‌లు ఆడిన రచిన్‌ రవీంద్ర 54 పరుగులు చేశాడు. కాగా భారత సంతతికి చెందిన ఆటగాళ్లు న్యూజిలాండ్‌కు ఆడటం కొత్తేమి కాదు.. . ఇష్ సోధీ, జీతన్ పటేల్, జీత్ రావల్ మొదలైనవారు భారత సంతతికి చెందినవారే. 

Tags:    

Similar News