WTC: తొలిరోజు పట్టు సాధించిన ఆస్ట్రేలియా జట్టు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది;
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలిరోజు ఆస్ట్రేలియా జట్టు పట్టు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించగా.. 146 పరుగులతో ఇంకా క్రీజ్‌లో ఉన్నారు. మరో బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 95 పరుగులు చేసి శతకానికి చేరువలో ఉన్నాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేయగా.. మార్నస్ లబుషేన్ 26 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.