Dhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.. వీడియో వైరల్..

Dhanashree Verma:రారా రెడ్డి పాటలో నితిన్‌తో పాటు అంజలి స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి.

Update: 2022-08-10 04:05 GMT

Dhanashree Verma: కొన్ని పాటలు ఎవరితో అయినా స్టెప్పులేయిస్తాయి. ముఖ్యంగా మాస్ సాంగ్స్ అయితే ఎక్కడలేని ఎనర్జీని తీసుకొస్తాయి. అలాంటి పాటల్లో ఒకటి నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం'లోని 'రారా రెడ్డి' పాట. ఇందులో ముఖ్యంగా జయం సినిమాలోని రాను రానంటూనే సిన్నదో పాటను రీమిక్స్ చేయడం సాంగ్‌కే హైలెట్‌గా నిలిచింది. అందుకే ఓ క్రికెటర్ భార్య కూడా ఈ పాటకు స్టెప్పులేసింది.

నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్‌కు జంటగా కృతి శెట్టి నటిస్తుండగా.. కేథరిన్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంతలా హైప్ రావడానికి ముఖ్య కారణం రారా రెడ్డి పాట అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో నితిన్‌తో పాటు అంజలి స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో యుజువేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీవర్మ కూడా ఈ పాటకు ఆడిపాడింది.

ధనశ్రీవర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు రీల్స్‌తో కూడా ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. అలాంటి ధనశ్రీ రారా రెడ్డి పాటకు స్టెప్పులేసి అందరిలో జోష్ నింపింది. అంతే కాకుండా తాను పెట్టిన ఈ డ్యాన్స్ పోస్ట్‌కు నితిన్‌ను కూడా ట్యాగ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Tags:    

Similar News