Nirmal District: నిర్మల్‌ జిల్లా కలెక్టర్ పేరిట వాట్సాప్ ఖాతా.. పలువురు అధికారులకు మెసేజ్‌లు..

Nirmal District: నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా తీవ్ర కలకలం రేపింది.;

Update: 2022-04-03 15:56 GMT

Nirmal District: నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా తీవ్ర కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లు ఇలా ప్రముఖుల పేర్లతో ఖాతాలు సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారప్ అలీ ఫారూకి పేరు, ఫోటోతో ... వాట్సాప్‌ ప్రొపైల్ సూచించే నెంబర్‌ నుంచి పలువురు అధికారులకు, ఇతరులకు మేసేజ్‌లు రావడం కలకలం రేపింది.

ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు నకిలీ వాట్సాప్ ఖాతాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెంబర్‌ కు జిల్లా కలెక్టర్‌కు ఎటువంటి సంబంధంలేదని.. ఎవరికైనా మేసేజ్‌లు వస్తే నమొద్దని హెచ్చరించారు.కలెక్టర్ పేరుతో నలికి ఖాతా సృష్టించిన వ్యక్తి బీహార్ కుచెందిన వాడుగా గుర్తించారు.

Tags:    

Similar News