సెంట్రల్ జైలుకు నటి రాగిణి ద్వివేది
శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన..;
శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అక్రమ మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన దర్యాప్తులో, కన్నడ చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న మరో ఆరుగురితో పాటు ఆమె కస్టడీని పొడిగించారు.. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు కస్టడీకీ తీసుకుని ప్రశ్నించారు. మరోవైపు నటి సంజన గల్రానిపై డ్రగ్స్ సేవించడంతో పాటు సరఫరా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.