Bangalore: రాపిడో డ్రైవర్ రాష్ డ్రైవింగ్.. ప్రశ్నించిన ప్రయాణికురాలికి చెంపదెబ్బ
ఆఫీస్ టైమ్ అయిపోతోంది. అందుబాటులో ఉన్న వాహన్నాల్లో ర్యాపిడో అయితే కాస్త తక్కువ త్వరగా కూడా వెళ్లిపోవచ్చు. అదే ఆలోచించింది ఆమె. ర్యాపిడో బుక్ చేసుకుంది. కానీ డ్రైవర్ చాలా స్పీడుగా బండి డ్రైవ్ చేస్తున్నాడు.. సిగ్నల్స్ కూడా జంప్ చేస్తున్నాడు.. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించింది. దానికి అతడు చెంపదెబ్బ కొట్టాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
బెంగళూరులోని జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. దీనితో మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలోని ఒక ఫుట్‌వేర్ షోరూమ్ దగ్గర ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఆ మహిళ డ్రైవర్‌ను ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. వాగ్వాదం జరుగుతున్న సమయంలో డ్రైవర్ ఆ మహిళను చెంపదెబ్బ కొట్టడంతో ఆమె నేలపై పడిపోయింది, ఈ చర్యను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Bengaluru @rapidobikeapp bike rider slaps customer as she allegedly questions him over rash driving and jumping signal
— nikesh singh (@nikeshs86) June 16, 2025
Lady falls to the ground after Rapido rider slaps her hard pic.twitter.com/eM4aec1NzW