Nirav modi case Details.. పీఎన్‌బీ స్కాం నుంచి యూకే కోర్టు తీర్పు వరకు.. డీటైల్డ్‌గా!
Nirav modi case Details..20018 to 2021;
Nirav modi case Dtails..
జనవరి 29, 2018: పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ( నీరవ్ మేనమామ)పై రూ.281కోట్ల రూపాయల మోసం చేశారంటూ కంప్లైంట్ చేసింది
ఫిబ్రవరి 5, 2018: సిబిఐ దర్యాప్తు ప్రారంభం
ఫిబ్రవరి 16,2018: 56.74బిలియన్ రూపాయల విలువ కలిగిన వజ్రాలు, బంగారం, ఆభరణాలను సీజ్ చేసిన ఈడీ
ఫిబ్రవరి 17,2018: ఇద్దరు పిఎన్‌బి ఉద్యోగుల అరెస్ట్. నీరవ్ మోడీ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు అరెస్ట్
ఫిబ్రవరి 17, 2018: పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
ఫిబ్రవరి 21, 2018: నీరవ్ మోడీ సంస్థ సిఎప్ఓతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులను అరెస్ట్ చేసిన సిబిఐ, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్‌కి తాళం
ఫిబ్రవరి 22, 2018 : 9 లగ్జరీ కార్లను సీజ్ చేసిన ఈడీ
ఫిబ్రవరి 27, 2018: నీరవ్ మోడీపై అరెస్ట్ వారెంట్ జారీ
జూన్2, 2018: మనీలాండరింగ్‌కి పాల్పడినందుకు రెడ్ కార్నర్ జారీ చేసిన ఇంటర్ పోల్
జూన్ 25, 2018:నీరవ్ మోడీని దేశానికి రప్పించేందుకు ముంబై స్పెషల్ కోర్టులో ఈడీ పిటీషన్
ఆగస్ట్ 3, 2018: నీరవ్ మోడీ ఎక్స్‌ట్రాడిషన్ కోసం యూకే ఆధికారులకు భారత్ ప్ర్తత్యేక విజ్ఞప్తి
ఆగస్ట్ 20, 2018: లండన్‌లో తలదాచుకుంటున్నట్లు రూఢి కావడంతో నీరవ్‌ని అదుపులో తీసుకోవాల్సిందిగా కోరిన భారత్
డిసెంబర్ 27, 2018: నీరవ్ మోడీ యూకేలోనే ఉన్నట్లు ధృవీకరించిన లండన్
మార్చ్ 9, 2019: లండన్ వీధుల్లో నీరవ్ మోడీ తిరుగుతున్నట్లు ది టెలిగ్రాఫ్ గుర్తింపు, రోడ్డుపైనే నిలదీసిన వైనం
మార్చ్ 9, 2019: నీరవ్ మోడీని భారత్ పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టులో విజ్ఞప్తి చేసిన యూకే ప్రభుత్వం
మార్చ్ 18, 2019: అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు
మార్చ్ 20, 2019: వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టినయూకే, బెయిల్ నిరాకరించిన కోర్టు
మార్చ్ 20, 2019: హర్ మెజెస్టీస్ ప్రిజన్( జైలు)కి పంపిన కోర్టు
మార్చ్ 29, 2019: సెకండ్ బెయిల్ పిటీషన్ కొట్టివేసిన వెస్ట్‌మినిస్టర్ కోర్టు జడ్జి. ఏప్రిల్ 26కి వీడియో లింక్ ద్వారా హాజరుకు ఆదేశం
మే 8, 2019: మూడో సారీ నీరవ్ మోడీ బెయిల్ పిటీషన్ తిరస్కరణ
జూన్ 12, 2019: నాలుగో బెయిల్ పిటీషన్ తిరస్కరణ. అంతేకాదు పరారీ అవుతాడేమోనంటూ సందేహం వ్యక్తం చేసిన కోర్టు
ఆగస్ట్ 22, 2019 : సెప్టెంబర్ 19 వరకూ రిమాండ్ పొడిగింపు
నవంబర్ 6, 2019: మరోసారి బెయిల్ పిటీషన్ తిరస్కరించిన యూకే కోర్టు
మే 11, 2020: భారత్ పంపేందుకు విచారణ ప్రారంభం ఐదురోజుల పాటు విచారణ
మే 13, 2020: మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు మరిన్న ఆధారాలు సమర్పించిన భారత ప్రభుత్వం
సెప్టెంబర్ 7, 2020: ముంబై ఆర్ధూర్ రోడ్ జైలులో వసతులను పరిశీలించిన యూకే కోర్టు
డిసెంబర్ 1, 2020: నీరవ్ మోడీ రిమాండ్ మరింత పొడిగింపు, తుది విచారణను 2021కి వాయిదా
జనవరి 8, 2021: ఫిబ్రవరి 25న ఫైనల్ జడ్జ్‌మెంట్ ఇస్తామంటూ ప్రకటించిన యూకే వెస్ట్‌మినిస్టర్ కోర్టు
ఫిబ్రవరి 25, 2021: నీరవ్ మోడీని మనీలాండరింగ్ కేసులో దోషిగా నిర్ధారిస్తూ, భారత్‌కి పంపేందుకు అనుమతి ఇచ్చిన యూకే కోర్టు