నవీన్‌ను హత్య చేయడం తప్పేనని నిందితుడు హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ అన్నారు. నవీన్‌ను తన కుమారుడు చంపడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు కోరుతున్నానని కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తన కుమారుడి ప్రేమ గురించి ముందే తెలుసునని చెప్పారు. నవీన్‌ను చంపిన తర్వాత ఆరోజు అర్ధరాత్రి హరిహరకృష్ణ తన దగ్గరకు వచ్చాడని.. పోలీసులకు లొంగిపొమ్మని చెప్పానని ప్రభాకర్ తెలిపారు.