అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. కాగా.. తన ప్రేమకు అడ్డుతగులు తున్నాడని స్నేహితుడైన నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతడి నుండి హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు, వాడిన వస్తువుల స్వాధీనానికి కస్టడీకి ఇవ్వాలని వనస్థలిపురం ఏసీపీ.. రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసుల తరపున అదనపు పీపీ ప్రతాప్ రెడ్డి వాదనలు వినిపించారు. హరిహరకృష్ణ ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో కోరగా.. న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక నిందితుడి కస్టీడీ ముగి సిన తర్వాత.. ఆధారాలతో సహా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.