Dr Krishna Singh: 35 ఏళ్లుగా మహిళా పేషెంట్లపై లైంగిక దాడికి పాల్పడుతున్న డాక్టర్..
Dr Krishna Singh: 1983 నుంచి 2018 వరకు పలువురు మహిళలపై కృష్ణ సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.;
Dr Krishna Singh (tv5news.in)
Dr Krishna Singh: అన్ని వృత్తుల్లో డాక్టర్ వృత్తి ఎంతో ప్రత్యేకమైనది అంటుంటారు. ఎవరు ఏం చెప్పినా నమ్మనివారు కూడా డాక్టర్లు చెప్తే నమ్ముతారు. అలాంటిది ఓ డాక్టర్ తన వైద్యవృత్తిని అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ ఘటన బ్రిటన్‌లో జరిగినా.. నిందితుడు మాత్రం భారత సంతతికి చెందినవాడు కావడం గమనార్హం.
ఎన్నో ఏళ్లుగా వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ కృష్ట సింగ్.. 35 ఏళ్లుగా పలువురు మహిళా పేషెంట్లపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టుగా నిర్దారణ అయ్యింది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు మొత్తం 48 మంది మహిళలపై కృష్ణ సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
2018లో తొలిసారి ఓ మహిళ కృష్ణ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి విచారణ చేపట్టగా.. ఇన్నాళ్లకు కృష్ణ సింగ్ నిందితుడని గ్లాస్గోలోని హైకోర్టు తేల్చింది. అయితే అతడికి శిక్ష మాత్రం వచ్చే నెల విధించనుంది కోర్టు. అప్పటివరకు కృష్ణ సింగ్ దేశం విడిచి వెళ్లకూడదని, తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోమని పోలీసులకు ఆదేశాలు అందించింది.