Mahbubnagar: యువతిపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి కాబోయే భర్తకు వాట్సాప్..
Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.;
Mahbubnagar (tv5news.in)
Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లా కేంద్రాలో అడ్డా కూలీగా ఉన్న యువతిని పని చూసిస్తామని నమ్మించిన ఇద్దరు పెయింటర్లు.. బైక్‌పై ఫతేపూర్ మైసమ్మ అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువతిని బెదిరించారు. ఆ తర్వాత మొబైల్ వీడియోలను యువతికి కాబోయే భర్తకు వాట్సప్ చేశారు.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందుతులను పట్టుకున్నారు. మల్కాపూర్‌కు చెందిన రాజు, కోటకధరకు చెందిన ఆంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.