Karnataka : లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారపార్టీ ఎమ్మెల్యే కుమారుడు
చెన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్ష మదల్.. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు;
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబట్టాడు. దీంతో అధికార పార్టీ అవినీతిపై విపక్షాలు మరోసారి తీవ్ర విమర్శలు చేశాయి. చెన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్ష మదల్.. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రశాంత్ మదల్ తన కార్యాలయంలో 40 లక్షలు తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు.
ప్రశాంత్ లంచం డిమాండ్ చేసినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదుతో లోకాయుక్త రంగంలోకి దిగింది. ప్రశాంత్‌ను పట్టుకునేందుకు అధికారులు వల పన్నారు. సదరు వ్యక్తి నుంచి ప్రశాంత్ తన కార్యాలయంలో 40 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం జరిపిన సోదాల్లో 1.7 కోట్ల నగదును గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు తన కుమారుడు లోకాయుక్త అధికారులకు పట్టుబటడంపై…. ఇప్పుడే ఏమీ మాట్లాడలేనంటూ విరూపాక్ష తప్పించుకున్నారు.