యెమెన్లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది. నేడు ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో యెమెన్ చివరి క్షణంలో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమిషప్రియ విడుదల కోసం.. కంఠాపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత, నిమిషప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు.. కుటుంబ సభ్యులు చర్చలలో పాల్గొన్నారు.