Hyderabad: నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులు..
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కీచకుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.;
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కీచకుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
దీంతో స్కూలుకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితున్ని పోలీసులకు అప్పగించారు. రజనీకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిపైనా కేసు పెట్టామన్నారు. స్కూల్‌పై ఆరోపణలు రావడంతో స్కూల్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.