NIMS: నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

Update: 2025-10-18 05:00 GMT

హై­ద­రా­బా­ద్ ని­మ్స్ ఆసు­ప­త్రి­లో అన­స్థీ­షి­యా వై­ద్య వి­ద్యా­ర్థి అను­మా­నా­స్పద స్థి­తి­లో మృతి చెం­దా­డు. వి­ద్యా­ర్థి ని­తి­న్‌ గు­రు­వా­రం రా­త్రి వి­ధు­ల­కు హా­జ­రు­కా­గా.. శు­క్ర­వా­రం ఉదయం ఆప­రే­ష­న్ థి­యే­ట­ర్లో వి­గ­త­జీ­వి­గా పడి ఉన్నా­డు. ఆసు­ప­త్రి సి­బ్బం­ది సమా­చా­రం­తో పం­జా­గు­ట్ట పో­లీ­సు­లు కేసు నమో­దు చే­సు­కు­ని దర్యా­ప్తు చే­ప­ట్టా­రు. మె­ద­క్ జి­ల్లా­కు చెం­దిన గి­రి­జన బి­డ్డ ని­తి­న్ మృ­తి­పై తల్లి­దం­డ్ర­లు అను­మా­నం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఏం జరి­గిం­దో తె­లి­య­దు అంటూ ని­మ్స్ అధి­కా­రు­లు వి­ష­యా­న్ని గో­ప్యం­గా ఉం­చ­డా­ని­కి మీ­డి­యా­ను అన్ని­వి­ధా­లు­గా తప్పు­దోవ పట్టి­స్తు­న్నా­రు. ఎవరో తమ బి­డ్డ­ను పొ­ట్ట­న­బె­ట్టు­కుం­టే.. ఆత్మ­హ­త్య చే­సు­కు­న్న­ట్లు­గా చి­త్రీ­క­రిం­చే ప్ర­య­త్నం ఎం­దు­కు చే­స్తు­న్నా­ర­ని ఆరో­పి­స్తూ ని­తి­న్ తల్లి­దం­డ్రు­లు, బం­ధు­వు­లు ని­మ్స్ హా­స్పి­ట­ల్ వద్ద ఆం­దో­ళన చే­శా­రు. ఇప్ప­టి­కై­నా అధి­కా­రు­లు వా­స్త­వ­మేం­టో బయ­ట­పె­ట్టా­ల­ని జూ­ని­య­ర్ డా­క్ట­ర్లు, ని­తి­న్ సహ­చ­రు­లు, మి­త్రు­లు డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. ఆరో­గ్య శాఖ మం­త్రి గారు.. మీ సొంత ఉమ్మ­డి జి­ల్లా­కు చెం­దిన వి­ద్యా­ర్థి మృ­తి­పై వెం­ట­నే స్పం­దిం­చా­ల్సిన అవ­స­ర­ముం­ది, ఎలా ని­తి­న్ మృతి చెం­దా­డు తె­లు­సు­కు­ని ప్ర­క­టన చే­యా­లం­టూ మృ­తు­డి బం­ధు­వు­లు, స్నే­హి­తు­లు డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు.

 "కేసీఆర్ ముందుచూపుతోనే మెడికల్ పార్క్"

ఒక­ప్పు­డు గు­ట్ట­లు, స్టో­న్ క్ర­ష­ర్ లతో నిం­డి ఉన్న సు­ల్తా­న్ పూర్ ప్రాం­తా­న్ని మె­డి­క­ల్ పరి­క­రాల రం­గం­లో ప్ర­పం­చా­ని­కే తల­మా­ని­కం­గా తీ­ర్చి­ది­ద్దిన ఘనత మాజీ ము­ఖ్య­మం­త్రి కే­సీ­ఆ­ర్ కే దక్కు­తుం­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్, మాజీ మం­త్రి కల్వ­కుం­ట్ల తారక రామ రావు అన్నా­రు. శు­క్ర­వా­రం అమీ­న్ పూర్ ము­న్సి­పా­లి­టీ పరి­ధి­లో­ని సు­ల్తా­న్ పూర్ మె­డి­క­ల్ డి­వై­స్ పా­ర్క్ లో HUWEL లైఫ్ సై­న్సె­స్ పరి­శ్రమ నూతన కె­మి­స్ట్రీ ల్యా­బ్ ను ఆయన ము­ఖ్య అతి­థి­గా హా­జ­రై ప్రా­రం­భిం­చా­రు.

Tags:    

Similar News