'పతిసహగమనం'.. భార్య చితిమంటలో దూకేసిన భర్త..!
ఓడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో 'పతిసహగమనం' జరిగింది. చనిపోయిన భార్య చితిమంటలో భర్త కూడా దూకేశాడు. ఆ తర్వాత అతను తీవ్రగాయాలతో మరణించాడు.;
ఓడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో 'పతిసహగమనం' జరిగింది. చనిపోయిన భార్య చితిమంటలో భర్త కూడా దూకేశాడు. ఆ తర్వాత అతను తీవ్రగాయాలతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. కలహండి జిల్లా సియాల్‌జోడి గ్రామానికి చెందిన రాయబారి సబర్ (57) గుండెపోటుతో మంగళవారం కన్నుమూసింది. ఆమెకి భర్త నీలమణి శబర్ మరియు నలుగురు కుమారులు ఉన్నారు. రాయబారి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్ళి అక్కడ చితి పేర్చి నిప్పు అంటించారు. అనంతరం తిరిగి అందరు ఇంటికి వెళ్తుండగా ఆమె భర్త నీలమణి మాత్రం వెనక్కి వచ్చి ఒక్కసారిగా ఆమె చితిమంటలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే భార్యతో పాటుగా అతను కూడా కాలిచనిపోయాడు. దీనిని అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.