Suicide: ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి.. డబ్బులు పోవడంతో ఆత్మహత్య..
Suicide: ఆన్‌లైన్‌లో గేమ్స్.. ఏదో సరదాగా ఆడదామని మొదలు పెడతారు.. మొదట్లో డబ్బులు వచ్చి ఆడడానికి పురిగొల్పుతుంటాయి.;
Suicide: ఆన్‌లైన్‌లో గేమ్స్.. ఏదో సరదాగా ఆడదామని మొదలు పెడతారు.. మొదట్లో డబ్బులు వచ్చి ఆడడానికి పురిగొల్పుతుంటాయి. దాంతో ఇల్లు వాకిలి, పెళ్లాం, పిల్లలు అన్నీ పక్కన పెట్టిస్తే ఆటే పరమావధిగా ఆ పిచ్చిలో పడిపోతుంటారు.. అది కాస్తా రివర్సై ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు కొందరు.
తాజాగా చెన్నైలోని ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో పనిచేస్తున్న గణితంలో గ్రాడ్యుయేషన్ చేసిన భవానీ (29) జూన్ 5, ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవాని ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో డబ్బు, నగలు పోగొట్టుకున్నారు. సుమారు 20 సవర్ల ఆభరణాలు, రూ.3 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలిసింది. ఆమెకు ఆరేళ్ల క్రితం భాగ్యరాజ్‌తో వివాహమైంది. మూడు సంవత్సరాలు, ఏడాది వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడానికి అలవాటు పడిన భవానీ ఇంట్లో ఉన్న నగదుని, ఆభరణాలను పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించింది. అంతటితో ఆగకుండా ఆమె తన ఇద్దరు సోదరీమణుల నుండి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని, ఆ డబ్బును కూడా గేమ్ ఆడడానికి ఉపయోగించింది. అయితే మొత్తం డబ్బు గేమ్ లో పోగొట్టుకుంది. పోలీసుల నివేదిక ప్రకారం, ఆమె గేమ్‌లో దాదాపు రూ. 10 లక్షలు పోగొట్టుకుంది. నాలుగు రోజుల క్రితం ఈ విషయాన్ని తన సోదరితో పంచుకుంది.
ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో శవమై కనిపించింది. వెంటనే ఆమెను ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మనాలి న్యూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రేగుపతి.. రాష్ట్ర ప్రభుత్వం "ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించడానికి కట్టుబడి ఉంది, ప్రస్తుత చట్టాలను అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని అన్నారు.
గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించేందుకు 2020లో ఆర్డినెన్స్ తీసుకురాగా, నిషేధం రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది.