Nizamabad: నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెలుగులోకి సూసైడ్ లెటర్..
Nizamabad: ఇటీవల నిజామాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది.;
Nizamabad: ఇటీవల నిజామాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. రియల్టర్ సూర్యప్రకాష్ చేతిలో సూసైట్ నోట్ దొరికింది.నా చావుకు ముగ్గురు వ్యక్తులు కారణమని,వెంకటసందీప్,కళ్యాణచక్రవర్తి,కిరణ్ కుమార్‌లు తనను చాలా ఇబ్బంది పెట్టారని, తన దగ్గర చెక్కులు, ప్రామసరీ నోట్లు తీసుకొని వేధించారని లెటర్‌లో తెలిపాడు సూర్యప్రకాష్. తన ఇంటి దగ్గరే రౌడీలతో కొట్టించి తన పరువు మొత్తం తీయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని,పోలీసులు న్యాయం చేయాలని సూసైడ్ నోట్‌లో తెలిపాడు రియల్టర్ సూర్యప్రకాష్.