Warangal District : పేదల గుడిసెలకి నిప్పు..!
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో దుండగులు రెచ్చిపోయారు. కాకతీయ నగరం వద్ద కొందరు నిరుపేదలు అసైన్డ్ భూములలో గుడిసెలు వేసుకోని నివసిస్తున్నారు.;
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో దుండగులు రెచ్చిపోయారు. కాకతీయ నగరం వద్ద కొందరు నిరుపేదలు అసైన్డ్ భూములలో గుడిసెలు వేసుకోని నివసిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 40 మంది గుర్తుతెలియని వ్యక్తులు కర్రాలు, రాడ్ లతో వచ్చి మహిళలు, వృద్దులు, పిల్లల పైన దాడి చేశారని స్థానికులు వాపోయారు. అడ్డొచ్చిన వారందరినీ చావబాదారని తెలిపారు.. అయితే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.