Peddapalli : పెద్దపల్లిలో కార్మికుడి అనుమానాస్పద మృతి..
Peddapalli : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్‌లోని బావిలో మృతదేహం కలకలం సృష్టించింది.;
Peddapalli : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్‌లోని బావిలో మృతదేహం కలకలం సృష్టించింది. RFCL మాజీ కార్మికుడు ముంజ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. హరీష్ ఆచూకీ కోసం పోలీసులు రాత్రి వరకు గాలించారు. ఇక తెల్లవారుజామున కమాన్పూర్‌లోని చెరువు పక్కన ఉన్న బావిలో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం హరీష్‌దేనని పోలీసులు నిర్ధారించి పెద్దపల్లికి తరలించారు.