నన్నే ప్రశ్నిస్తావా... సామాన్యుడిపై సర్పంచ్ దాడి..!
వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్‌లో... అధికార పార్టీ సర్పంచ్ చెలరేగిపోయాడు.;
వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్‌లో... అధికార పార్టీ సర్పంచ్ చెలరేగిపోయాడు. గ్రామంలో నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలపై స్థానికుడు శ్రీనివాస్... సర్పంచ్ జైపాల్‌రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్... నీకెందుకు రా అంటూ.. శ్రీనివాస్‌పై దాడికి దిగాడు. శ్రీనివాస్‌ను కిందపడేసి కాలితో తన్నాడు. దాడి చేసిన సర్పంచ్ జైపాల్‌రెడ్డిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైట్‌పై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.