TERROR ATTACK: ఉగ్రవాదుల అడ్డా.. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ..?

అల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే ముష్కరుల ఉగ్ర మూలాలు

Update: 2025-11-13 06:30 GMT

ఫరీ­దా­బా­ద్‌ ఉగ్ర మా­డ్యూ­ల్‌, ఎర్ర­కోట పే­లు­డు ఘట­న­తో ఇప్పు­డు దర్యా­ప్తు ఏజె­న్సీల దృ­ష్టి ‘అల్‌ - ఫలా­హ్‌’ యూ­ని­వ­ర్సి­టీ­పై పడిం­ది. వై­ద్యు­లు, టీ­చ­ర్ల ము­సు­గు­లో ఈ వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో చే­రిన కొం­ద­రు దీ­న్ని తమ ఉగ్ర కా­ర్య­క­లా­పా­ల­కు అడ్డా­గా మా­ర్చు­కు­న్నా­రు. ఒక­ప్పు­డు ప్ర­తి­ష్ఠా­త్మక జా­మి­యా, అలీ­గ­ఢ్‌ వి­శ్వ­వి­ద్యా­ల­యా­ల­కు ప్ర­త్యా­మ్నా­యం­గా కన్పిం­చిన ‘అల్‌-ఫలా­హ్‌ ఇప్పు­డు ఉగ్ర కు­ట్ర­ల­కు కేం­ద్రం­గా వా­ర్త­ల్లో ని­ల­వ­డం­తో అక్కడ చదు­వు­తు­న్న వి­ద్యా­ర్థు­ల్లో గు­బు­లు పట్టు­కుం­ది. హరి­యా­ణా­లో­ని ఫరీ­దా­బా­ద్‌ జి­ల్లా ధౌ­జ్‌ గ్రా­మం­లో 76 ఎక­రా­ల్లో అల్‌-ఫలా­హ్‌ యూ­ని­వ­ర్సి­టీ వి­స్త­రిం­చి ఉంది. హరి­యా­ణా ప్రై­వే­టు యూ­ని­వ­ర్సి­టీల చట్టం కింద దీ­న్ని ఏర్పా­టు­చే­శా­రు. 1997లో ఇం­జి­నీ­రిం­గ్‌ కా­లే­జీ­గా మొ­ద­లైం­ది. 2013లో యూ­జీ­సీ­కి చెం­దిన నా­క్‌ నుం­చి ‘ఏ’ గ్రే­డ్‌ అం­దు­కుం­ది. 2014లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం దీ­ని­కి యూ­ని­వ­ర్సి­టీ హోదా కల్పిం­చిం­ది.

వైద్యులను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ

దేశ రా­జ­ధా­ని ఢి­ల్లీ పే­లు­డు దర్యా­ప్తు­లో.. ఉగ్ర­వాద రి­క్రూ­ట్‌­మెం­ట్, ఆప­రే­ష­న్ల­లో ఎవరూ ఊహిం­చ­ని భయం­క­ర­మైన వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. ము­ఖ్యం­గా షో­పి­యా­న్‌­కు చెం­దిన మౌ­ల్వీ ఇర్ఫా­న్ అహ్మ­ద్ వాగే అలి­యా­స్ ఇమా­మ్ ఇర్ఫా­న్.. ఈ 'వై­ట్-కా­ల­ర్' ఉగ్ర నె­ట్‌­వ­ర్క్‌­కు ప్ర­ధాన సూ­త్ర­ధా­రి­గా ఉన్న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. మొ­ద­ట్లో మత గు­రు­వు­గా ఉన్న ఇమా­మ్ ఇర్ఫా­న్.. ఆ తర్వాత పా­రా­మె­డి­క­ల్‌­గా మారి వై­ద్యు­ల­ను ఉగ్ర­వా­దు­లు­గా మా­ర్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. ము­ఖ్యం­గా GMC శ్రీ­న­గ­ర్‌­లో అత­ని­కు­న్న పరి­చ­యా­లు, నౌ­గా­మ్‌­లో­ని స్థా­నిక మసీ­దు­ల్లో అతను చేసే మత ప్ర­సం­గాల ద్వా­రా.. సు­ల­భం­గా ప్ర­భా­వి­త­మ­య్యే వి­ద్యా­వం­తు­లైన యు­వ­త­ను గు­ర్తిం­చి, వా­రి­ని రా­డి­క­లై­జే­ష­న్ వైపు నె­ట్టే­వా­డ­ని సమా­చా­రం. ఇమా­మ్ ఇర్ఫా­న్ అహ్మ­ద్‌ గతం­లో శ్రీ­న­గ­ర్‌­లో­ని ప్ర­భు­త్వ వై­ద్య కళా­శా­ల­లో పా­రా­మె­డి­క­ల్ సి­బ్బం­ది­గా పని­చే­శా­రు. నౌ­గా­మ్‌­లో­ని ఒక మసీ­దు­లో కలి­సిన అనేక మంది వి­ద్యా­ర్థు­ల­తో ఆయన సం­బం­ధా­లు కొ­న­సా­గిం­చా­రు. ఫరీ­దా­బా­ద్‌­లో­ని వై­ద్య వి­ద్యా­ర్థు­ల­ను అహ్మ­ద్ క్ర­మం­గా తీ­వ్ర­వాద ఆలో­చ­న­ల­తో ప్ర­భా­వి­తం చే­శా­డ­ని, పా­కి­స్తా­న్‌­కు చెం­దిన ఉగ్ర­వాద సం­స్థ జైష్-ఎ-మొ­హ­మ్మ­ద్ అత­ని­కి స్ఫూ­ర్తి­ని­చ్చిం­ద­ని వారు తె­లి­పా­రు. 

జైషే మహ్మద్ వీడియోలను

ఇమా­మ్ ఇర్ఫా­న్ అహ్మ­ద్‌ తన -స్టూ­డెం­ట్ లకు జైషే మహ్మ­ద్ వీ­డి­యో­ల­ను రోజూ చూ­పిం­చి మో­టి­వే­ట్ చే­సే­వా­డ­ని తె­లి­పా­రు. అహ్మ­ద్‌  డేటా కనె­క్ష­న్ ఉప­యో­గిం­చి చే­సిన కా­ల్స్ ద్వా­రా ఆఫ్ఘ­ని­స్తా­న్‌­లో­ని కొం­త­మం­ది­తో సం­ప్ర­దిం­పు­లు జరి­పే­వా­డ­ని పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. వి­ద్యా­ర్థుల మన­స్సు­ల­లో తీ­వ్ర­వాద ఆలో­చ­న­ల­ను లో­తు­గా చొ­ప్పిం­చ­డ­మే అతని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­డ­ని తె­లి­పా­రు. ము­జ­మ్మి­ల్ షకీ­ల్,  మహ్మ­ద్ ఉమర్ అనే ఇద్ద­రు వై­ద్యు­లు ఈ మి­ష­న్‌­ను చు­రు­కు­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్తు­న్నా­ర­ని తె­లి­సిం­ద­న్నా­రు. మొ­త్తం మా­డ్యూ­ల్‌­ను అహ్మ­ద్ రూ­పొం­దిం­చా­ర­ని వె­ల్ల­డిం­చా­రు.  ఫరీ­దా­బా­ద్ మా­డ్యూ­ల్ బయ­ట­ప­డిన తర్వాత తీ­వ్ర భయాం­దో­ళ­న­కు గురై ఢి­ల్లీ పే­లు­డు­కు మహ­మ్మ­ద్ ఉమర్ పా­ల్ప­డ్డా­డ­ని వర్గా­లు తె­లి­పా­యి. ఉమ­ర్‌­కు మౌ­ల్వీ ఇర్ఫా­న్ అహ్మ­ద్‌­తో ప్ర­త్య­క్ష సం­బం­ధా­లు ఉన్నా­యి. ఉత్త­ర­ప్ర­దే­శ్‌­లో­ని లక్నో­లో ని­వ­సి­స్తు­న్న డా­క్ట­ర్ షా­హీ­న్ సయీ­ద్ ఈ మా­డ్యూ­ల్‌­కు ఫై­నా­న్షి­య­ర్ అని వె­లు­గు­లో­కి వచ్చిం­ది. ఆమె అల్-ఫలా­హ్ వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో ప్రొ­ఫె­స­ర్ గా  తె­ల్చా­రు. ఈమె జైష్-ఎ-మొ­హ­మ్మ­ద్ మహి­ళా వి­భా­గం­లో పని­చే­సిం­ది. 

Tags:    

Similar News