Viveka Case : వివేకా కేసులో మరో హై డ్రామా

Update: 2023-03-05 08:12 GMT

పులివెందుల వేదికగా వైఎస్‌ వివేకా కేసులో మరో హై డ్రామా నడిచింది. తనపై దాడి చేశారంటూ ఈకేసులో A3గా ఉన్న ఉమాశంకర్‌ రెడ్డి భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మా పరమేశ్వర్‌ రెడ్డి,ఆయన కుమారుడు తన ఇంట్లోకి బలవంతంగా దూరి..నీ భర్త వివేకాను చంపి డబ్బులు తెచ్చుకున్నాడంటూ.. నీభర్తను, నిన్ను చంపేస్తానని బెదిరించినట్లు ఆమె తెలిపారు.బలంగా తోయడంతో కిందపడి గాయాలు అయ్యాయని, అసుపత్రిలో చేరానన్నారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News