ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళ.. బ్లాక్ మెయిల్ చేయడంతో..
లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. లక్ష్మీనగర్ బస్తీలో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.;
లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. లక్ష్మీనగర్ బస్తీలో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ మహిళతో ఓ రోజు వీడియో కాల్ చేసి మాట్లాడాడు... ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌ను బయటపెడతానని మహిళ బ్లాక్ మెయిల్ చేయడంతో శివశంకర్ బలవన్మారణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.