మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 48 బంద్‌కు పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ నాలుగేళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటన రాకపోవడంతో 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు అఖిలపక్ష నేతలు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.