గచ్చిబౌలి ఫ్లై ఓవర్ రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేత.. కారణం
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.. సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉండి, సిగ్నల్ లైట్స్ సరిగా పని చేస్తున్నా తప్పించుకుని రయ్ మని దూసుకుపోవడానికే ప్రయత్నిస్తుంటారు వాహనదారులు.. దీంతో యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అయినా ఎవరూ మారర.;
ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు, వివిధ ప్రదేశాలు/జంక్షన్‌లు/రోడ్‌ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. గచ్చిబౌలి జంక్షన్‌లో ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 22 మంగళవారం నుండి అక్టోబర్ 28 సోమవారం రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నందున సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు: (రాత్రి 11 నుండి ఉదయం 6 వరకు)
బయో డైవర్సిటీ జంక్షన్ నుండి IIIT జంక్షన్ వరకు :
బయో డైవర్సిటీ నుండి IIIT జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ని బైపాస్ చేసి, దాని పక్కనే బిచ్చారెడ్డి స్వీట్స్ (టెలికాం నగర్) మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి, తర్వాత IIIT జంక్షన్‌కు వెళ్లాలి.
IIIT జంక్షన్ నుండి బయో డైవర్సిటీ జంక్షన్ వరకు :
IIIT జంక్షన్ నుండి బయోడైవర్సిటీ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను దాటి దాని పక్కన గచ్చిబౌలి జంక్షన్ మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్ వరకు ప్రయాణించాలి.