రష్యాతో భూ మార్పిడి ఒప్పందానికి సిద్ధం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

ఉక్రెయిన్ రష్యాతో భూ మార్పిడి ఒప్పందానికి సిద్ధంగా ఉందని, అయితే అమెరికా మద్దతుగల భద్రతా హామీలను మాత్రమే కోరుతుందని అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ అన్నారు.;

Update: 2025-02-12 11:08 GMT

ఉక్రెయిన్ రష్యాతో భూ మార్పిడి ఒప్పందానికి సిద్ధంగా ఉందని, అయితే అమెరికా మద్దతుగల భద్రతా హామీలను మాత్రమే కోరుతుందని అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వైపులా చర్చల కోసం తీసుకువస్తే, ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూమికి బదులుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కుర్స్క్ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. 

గత ఆగస్టులో జరిగిన ఆకస్మిక దాడిలో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. దాదాపు మూడు సంవత్సరాల యుద్ధాన్ని తాను ముగించగలనని ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చల ద్వారా ఇప్పటికే పురోగతి సాధించామని ట్రంప్ తెలిపారు.

 "యుద్ధంలో ప్రజలు చనిపోవడం ఆపాలని కోరుకుంటున్నాను" అని ఆయన తనకు చెప్పారని వ్లాదిమిర్ తెలిపారు. అయితే, ఏదైనా తీర్మానానికి రెండు వైపుల నుండి రాయితీలు అవసరమని ట్రంప్ సర్కిల్‌లోని అధికారులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో, అమెరికా మధ్యవర్తిత్వం వహించే ఏదైనా శాంతి ఒప్పందంలో కఠినమైన భద్రతా హామీలు ఉండాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. "అమెరికన్లు లేకుండా యూరప్ భద్రతా హామీలను అందించగలదని చెప్పే మాటలను నేను విశ్వసించలేను అని జెలెన్

Tags:    

Similar News