మహావీర్ చక్ర అవార్డు దక్కడంపై సంతోష్ బాబు తల్లిదండ్రులు హర్షం
పరమవీర చక్ర అవార్డు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని తమ అభిప్రాయం తెలిపారు తల్లిదండ్రులు.;
దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన మహావీర్ చక్ర అవార్డు తమ కుమారుడు దివంగత సంతోష్ బాబుకు దక్కడంపై సంతోషం వ్యక్తంచేశారు ఆయన తల్లిదండ్రులు. అయితే పరమవీర చక్ర అవార్డు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని తమ అభిప్రాయం తెలిపారు.
గతంతో పోలిస్తే దేశ సరిహద్దుల విషయంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందన్నారు. భారత భూభాగంలోకి శత్రువులు వస్తే తిప్పికొట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొనియాడారు.
గతంలో భారత్-చైనా సరిహద్దుల్లో కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కాదని.. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యత ఇస్తున్నారని వెల్లడించారు.