Gas pain or Chest Pain: అది గ్యాస్ పెయినా లేక చెస్ట్ పెయినా.. గుర్తించడం ఎలా!!

Gas pain or Chest Pain: గ్యాస్ ప్రాబ్లం.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సాధారణ సమస్య అయిపోయింది. సమయానికి తినకపోవడం ఒకటైతే, జంక్ ఫుడ్, మసాలాలు వంటివి కూడా గ్యాస్ కి కారణమవుతున్నాయి.

Update: 2022-05-05 12:15 GMT

Gas Pain or Chest Pain: గ్యాస్ ప్రాబ్లం.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సాధారణ సమస్య అయిపోయింది. సమయానికి తినకపోవడం ఒకటైతే, జంక్ ఫుడ్, మసాలాలు వంటివి కూడా గ్యాస్ కి కారణమవుతున్నాయి. ఒక్కోసారి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది.. చెస్ట్ లో పెయిన్ కూడా వస్తుంది. దాంతో అది గ్యాస్ నొప్పో లేక గుండెనొప్పో అర్థం కాదు చాలా మందికి.. మరి దీన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.

జీర్ణవ్యవస్థ పనితీరులో గ్యాస్ అనేది ఒక సాధారణ భాగం. తిన్న తర్వాత మీకు ఛాతీ నొప్పి అనిపిస్తే ఆందోళన చెందాల్సిన అంశం. అది గ్యాస్ నొప్పి అయితే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది.

గ్యాస్ అని తెలుసుకోవడం ఎలా?

మీ కడుపులో గ్యాస్ ఏర్పడినట్లయితే మీకు ఛాతీ నొప్పి అనిపించవచ్చు. కడుపు ఉబ్బరం కలిగించే ఆహారలు కూడా అనేకం ఉంటాయి. అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. కృత్రిమ స్వీటెనర్లు, సోడాలు వంటి కార్బోనేటేడ్ పానీయాలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు పేగులో ఫైబర్ నిల్వకు కారణమవుతుంది. దీని వలన గ్యాస్ ఏర్పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల జ్వరం, వికారం లేదా వాంతులు, విరేచనాలు లేదా మలంలో రక్తంతో పాటు గుండె దగ్గర గ్యాస్ నొప్పి వస్తుంది.

గ్యాస్‌కి కారణమేమిటి?

గ్యాస్ నొప్పి తరచుగా ఛాతీ దిగువ భాగంలో వస్తుంది. కొన్ని ఆహార పదార్ధాలకు అలెర్జీ ఉండటం వలన కూడా గ్యాస్ నొప్పికి కారణం కావచ్చు.

గుండెల్లో మంట అనేది ఒక రకమైన అజీర్ణం. ఇది అన్నవాహికలోకి పొట్టలోని ఆమ్లం లీక్ కావడం వల్ల వస్తుంది.

సమయానికి ఆహారం తీసుకోకపోతే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. ఇది అదనపు గ్యాస్‌ను కలిగిస్తుంది.

ఆల్కహాల్‌ అధికంగా ఉండే ఆహారం కొంతమందిలో గ్యాస్‌ లక్షణాలను కలిగిస్తుంది.

అధిక-ఫైబర్ ఆహారాలు జీర్ణవ్యవస్థకు మంచివి అయితే, కొన్ని రకాల ఫైబర్లు ఎక్కువగా తినడం వల్ల అదనపు గ్యాస్ ఏర్పడుతుంది.

గ్యాస్ కారణంగా గుండె నొప్పి Vs ఛాతీ నొప్పి

గుండె నొప్పి

గుండె నొప్పి తరచుగా ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు భారంగా అనిపించవచ్చు.

ఇది నెమ్మదిగా మొదలై తరవాత తీవ్రమవుతుంది.

అకస్మాత్తుగా సంభవిస్తుంది, లక్షణాలు మీరు తిన్న దేనిపైనా ఆధారపడి ఉండవు.

ఛాతీలో అసౌకర్యం, ఒత్తిడి, నొప్పి, మంట, కళ్లు తిరగడం, ఆకస్మికంగా చెమటలు పట్టడం, శ్వాస ఆడకపోవడం మొదలైనవి అన్నీ గుండెనొప్పి సంకేతాలు.

గ్యాస్ నొప్పి

కడుపు లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి. అయితే ఈ నొప్పి మొదలైనంత వేగంగా తగ్గిపోతుంది. ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టదు.

పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట ఉంటే , అది మీ ఛాతీలో గ్యాస్‌కు సంబంధించినది కావచ్చు.

తిన్న వెంటనే, పడుకున్నప్పుడు లేదా వంగినప్పుడు నొప్పి అనిపించవచ్చు.

ముగింపు

గ్యాస్ నొప్పి సాధారణంగా మందులతో తగ్గిపోతుంది. మరింత తీవ్రమైన పరిస్థితిలో అత్యవసర వైద్య సహాయం పొందాలి. ఛాతీ నొప్పి లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా నొప్పి 2 గంటల కంటే ఎక్కువసేపు ఉంటే ఇంటి చికిత్సకు స్పందించకపోతే వెంటనే వైద్యుడని సంప్రదించాలి. ఆరోగ్య విషయంలో ఎంత మాత్రం అశ్రద్ధ పనికిరాదు. అనారోగ్యానికి జీవన శైలి కూడా ప్రధాన కారణమవుతుందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సమయానికి నిద్ర, ఆహారం ముఖ్యం. శరీరానికి నడక లాంటి వ్యాయామం ఎంతైనా అవసరం. 

Tags:    

Similar News