Women Health Issues: డియర్ మేడమ్స్.. మీ వయసు 30 దాటిందా.. అయితే కచ్చితంగా ఈ 6 ఆరోగ్య పరీక్షలు..

Women Health Issues: రాబోయే అనారోగ్య లక్షణాలకు సంకేతాలేమైనా ఉన్నాయేమో ముందుగా గుర్తించి జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంటుంది.

Update: 2021-10-08 02:30 GMT

Women Health Issues: ప్రస్తుత రోజుల్లో వయసుతో పన్లేదు.. వరుసబెట్టి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 30 దాటిన మహిళలు ముందు జాగ్రత్తగా కొన్ని టెస్టులు చేయించుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు. రాబోయే అనారోగ్య లక్షణాలకు సంకేతాలేమైనా ఉన్నాయేమో ముందుగా గుర్తించి జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంటుంది.

30 దాటినప్పుడు మునుపటిలా మీరుండలేరు. మీ శరీరం నెమ్మదిగా మారుతోంది. వయసు ఒక సంఖ్య మాత్రమే. అయినా వచ్చే వాటిని తట్టుకోవాలంటే ముందు జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వయసు పైబడిన కొద్దీ వచ్చే శారీరక మార్పులకు సిద్ధంగా ఉండటం చాలా అవసరం.

ఎముక బలహీనత 30 వ దశకంలో ప్రారంభమవుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాయామం మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాల్షియం ఉన్న తాజా ఆహారపదార్ధాలు, పండ్లు తీసుకోవాలి. సూర్య కిరణాలు మీ శరీరంపై ప్రసరించేలా ప్రతి రోజు ఓ అరగంట ఎండలో ఉండాలి.

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత చేయించుకోవలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు..

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ఒక గొప్ప మార్గం.

* రక్తపోటు : 30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం ఒకసారి రక్తపోటు (బిపి) ను చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే అధిక బిపి గుండె, మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మందులు వటి స్వల్ప మార్పు చేసుకుంటే సులభంగా మీ BP అదుపులో ఉంటుంది.

* కొలెస్ట్రాల్: మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించడానికి ఏకైక పద్ధతి రక్త పరీక్ష. ఒక మహిళకు చెడు కొలెస్ట్రాల్ అంటే 130 mg/dL కంటే ఎక్కువ ఉంటే, ఆమె ప్రతి సంవత్సరం చెక్ చేయించుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొలెస్ట్రాల్ టెస్ట్‌ను ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలని సిఫార్సు చేస్తుంది.

* థైరాయిడ్ పరీక్ష: థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. మూడ్ స్వింగ్స్, అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, క్రమరహిత (ఇర్రెగ్యులర్) రుతు చక్రాలు, నిద్ర లేమిమొదలైన లక్షణాలతో మీరు ఇబ్బంది పడుతుంటే థైరాయిడ్ హార్మోన్ T3, T4, TSH తో సహా రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ ఉందీ లేనిది నిర్ధారించుకోవచ్చు.

* పాప్‌స్మియర్: ప్రతి రెండు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పాప్ పరీక్ష, HPV పరీక్ష చేయించుకోవాలి. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే మీరు ఏటా పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి.

గర్భాశయ క్యాన్సర్ సంకేతాలతో పాటు గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి 'పాప్‌స్మియర్ పరీక్ష' ఉపయోగపడుతుంది.

* రొమ్ము క్యాన్సర్ పరీక్ష: మారిన జీవనశైలి కారణంగా, రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయి. రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించేందుకు రెగ్యులర్‌గా చెక్-అప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ముందుగా గుర్తించడం ద్వారా చాలా వరకు దీనిని నయం చేయవచ్చు.

* కంటి పరీక్ష: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్, మొబైల్ స్క్రీన్‌ల అధికంగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా కంటిచూపు సమస్యలను ఎదుర్కుంటున్నారు. కంటి సమస్యలు కూడా తలనొప్పికి కారణమవుతాయి.

30 నుండి 39 సంవత్సరాల మధ్య రెండుసార్లు కంటి పరీక్షను చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నట్లయితే, మీ కంటి సంరక్షణ నిపుణుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.

Tags:    

Similar News