ఛత్తీస్‌గఢ్‌లో బారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు DRG జవాన్లు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ- కుందేడ్ మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లు.. తిరుగు ప్రయాణంలో ఉండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతులు ఏఎస్సై రామ్ సింగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జో, వంజం భీమాగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ తర్వాత అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.