ఆక్సిజన్ అందక నలుగురు కరోనా రోగులు మృతి

మధ్యప్రదేశ్‌లో ఆక్సజన్ సిలిండర్లు కొరత వలన నలుగురు కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరతతో మరింత మంది ఇబ్బంది పడుతున్నారు.

Update: 2020-09-11 10:59 GMT

మధ్యప్రదేశ్‌లో ఆక్సజన్ సిలిండర్లు కొరత వలన నలుగురు కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరతతో మరింత మంది ఇబ్బంది పడుతున్నారు. దేవాస్ జిల్లాలోని ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమల్టాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ప్రైవేట్ ప్రవేట్ ఆస్పత్రిని ప్రభుత్వం కరోనా సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఈ ఆస్పత్రిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఏర్పడటంతో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే, మహారాష్ట్రాల నుంచి సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన గురించి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. మహారాష్ట్ర కూడా సిలిండర్ల కొరత ఉందని.. అయినప్పటకీ.. మధ్యప్రదేశ్‌కు సరఫరా కొనసాగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Tags:    

Similar News